|
వివాదాస్పదంగా మారిన ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల అధికారిక ఫలితాలు ఆదివారం ప్రకటిస్తామని ఆ దేశ ఎన్నికల కమిషన్ అధిపతి ఫరూక్ సుల్తాన్ తెలిపారు. శనివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లిం బ్రదర్‌హుడ్ అభ్యర్థి మహమ్మద్ మోర్సే, ముబారక్ శకం రాజకీయవేత్త అహ్మద్ షఫిఖ్ మధ్య జరిగిన ఎన్నికల ఫలితాలు గత వారం వాయిదా పడిన విషయం తెలిసిందే....
|
|
|
గాజా స్ట్రిప్‌లోని హమాస్ భద్రత లక్ష్యాలపై ఇజ్రాయిల్ గగనతల దాడులు జరిపింది. శనివారం వేకువ ఝామునే దాడులు మొదలు పెట్టింది. మూడు లక్ష్యాలపై ఇజ్రాయిల్ జరిపిన గగనతల దాడుల్లో కనీసం 17 మంది పౌరులు గాయపడినట్లుగా స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. కాగా, దాడులపై ఇజ్రాయిల్ నుంచి తక్షణ స్పందన కానరాలేదు.ఇజ్రాయిల్ మీద గాజా తీవ్రవాదులు రాకెట్ దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఎవరూ మృతి చెందలేదని అధికారులు...
|
|
|
పరాగ్వే అధ్యక్షుడు ఫెర్నాండో లూగోపై ఆ దేశ సెనెట్ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడంతో ఆయన అధికారం నుంచి తప్పుకున్నారు. ఫెర్నాండోపై సెనెట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం, దానిపై విచారణ, ఓటింగ్ చకచకా జరిగిపోవడం, తీర్మానానికి అనుకూలంగా 39 ఓట్లు, వ్యతిరేకంగా నాలుగు ఓట్లు రావడంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. వెంటనే ఉపాధ్యక్షుడు ఫెడరికో ఫ్రాంకో దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. ఈ అధికార మార్పిడి సమయంలో...
|
|
|
హోస్నీ ముబారక్ పతనానంతరం పాలనా పగ్గాలను చేపట్టిన సైనిక మండలి నిర్బంధాన్ని ఎంతగా ప్రయోగించినప్పటికీ లెక్కచేయకుండా ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. శనివారం తెహ్రీర్‌స్క్వేర్ వేలాది మంది నిరసనకారులతో హోరెత్తింది. ఇటీవలి కాలంలో అధ్యక్ష ఎన్నికల విషయంలో ముస్లిం బ్రదర్‌హుడ్‌కి, పాలక సైనిక మండలికి మధ్య రాజుకున్న వివాదం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. సైనిక మండలి నియంతృత్వాన్ని నిరసిస్తూ...
|
|
|
సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ శనివారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే కీలకమైన మంత్రి పదవుల్లో మాత్రం పాతవారినే కొనసాగించారు. హోం, రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖల అధిపతులను అలాగే ఉంచారని ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. రక్షణ మంత్రిగా తిరిగి దావూద్ రజానే నియమించడంతో గతంలో వచ్చిన పుకార్లన్నీ కొట్టుకుపోయాయి. ప్రభుత్వం వాటినన్నింటినీ తోసిపుచ్చినట్లయింది. రజాను రెబెల్స్ హతమార్చారని పుకార్లు...
|
|
|
ఏడాది సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాద ఘటనను ప్రపంచ ప్రజలు, ముఖ్యంగా జపనీయులు మర్చిపోక ముందే అందుకు కారణాలైన అణు రియాక్టర్లను పునఃప్రారం భించాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. అణురియాక్టర్లతో ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పును ఖాతరు చేయకుండా పెట్టుబడిదారీ సంస్థల లాభాల కోసం జపాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది. జపాన్ పశ్చిమ తీరంలో ఓయిలోని ఉన్న రెండు అణువిద్యుత్...
|
|
|
ఇండియన్-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌కు వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. 2006లో ఆమె అక్కడ ఆరు నెలలు గడిపి రికార్డు సృష్టించారు. జులై 14న కజకిస్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుండి ఆమె బయలుదేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఎక్స్‌పెడిషన్ 32 బృందంలో ఆమె ఫ్లైట్ ఇంజనీర్‌గా ఉంటారు. రోదసీ స్టేషన్‌కు చేరిన తర్వాత ఎక్స్‌పెడిషన్ 33కి ఆమె...
|
|
|
గుప్పిస్తున్నారు. సిఐటియు మినహా అన్ని కార్మిక సంఘాలు వాస్తవాలను మరుగున పెడుతూ తాత్కాలిక ప్రయోజనాలను కార్మికులకు ఎరగా చూపుతూ దీర్ఘకాలిక సమస్యల్ని అస్సలు పట్టించుకోవడంలేదు. ఎన్నికల గడువు మరో మూడు రోజులు మాత్రమే ఉండడంతో భూపాలపల్లి సింగరేణి ఏరియాలో హౌరాహౌరీగా ప్రచారం సాగుతోంది. కార్మిక సంఘాల నాయకులు ఒకరి తప్పుల్ని ఒకరు ఎత్తి చూపుతూ దుమ్మెత్తి పోసుకుంటున్న పరిణామాల మధ్య ప్రచారం రసవత్తరంగా మారింది. ఐదో దఫా...
|
|
|
జపాన్‌లోని ఇనమోరి ఫౌండేషన్ ప్రతి ఏటా ప్రదానం చేసే అత్యున్నత అంతర్జాతీయ అవార్డును ఈ ఏడాది తత్వశాస్త్ర విభాగంలో గాయత్రి స్పివాక్ గెల్చుకున్నారు. భారత్‌కు చెందిన గాయత్రి ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ఇచ్చే ఇతర అవార్డులను అమెరికాకు చెందిన ఇవాన్ సుదర్‌లాండ్ (కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీ), జపాన్‌కు చెందిన యొషినొరి ఒసుమి (బేసిక్ సైన్సెస్) సాధించారు....
|
|
|
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సిఎ), ఆటగాళ్ల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న వేతన వివాదం ఎట్టకేలకు పరిష్కారమైంది. శుక్రవారం ఇరుపక్షాల మధ్య ఈ మేరకు ఒక అవగాహన కుదిరింది. దీని ప్రకారం ఎంపిక చేసిన జాబితాలోని 17 మంది క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు పెరిగింది. దీంతోపాటు సిరీస్ గెలిస్తే బోనస్ అదనంగా వస్తుంది. గత 12 నెలల ఫామ్ ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా 17 మందితో కూడిన జాబితాను నామినేట్ చేస్తుంది. సిఎ, ఆటగాళ్ల మధ్య...
|
|
|
వాతావరణంలో ప్రస్తుతం సంభవిస్తున్న మార్పులు మూడో ప్రపంచ దేశాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతాయని క్యూబా అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న రియో+20 సదస్సు ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు, ముఖ్యంగా ద్వీపాలు వాటి భౌతిక ఉనికిని కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1990-2009 మధ్య కాలంలో కర్బన ఉద్గారాల విడుదల...
|
|
|
రోడ్డు సౌకర్యం సరిగా లేని గ్రామాలు నేటికీ అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలో నాయకులు వాగ్ధానాలు చేసి మీ గ్రామాల రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని తీరా గెలిచాక తమ గ్రామాల రోడ్ల గురించి పట్టించుకోవడం లేదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలోని ఆల్వకొండ-రెడ్డిపల్లె రోడ్డు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. గిద్దలూరు, లింగందిన్నె రోడ్డు, రెడ్డిపల్లె-పేరుసోముల రోడ్లు గుంతలు పడి వాహనదారులకు...
|
|
|
అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఎంపిక చేసిన అభ్యర్ధి షాహబుద్దీన్‌ను అరెస్టు చేయాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసిన తర్వాత ప్రధాని పదవికి పాలక పార్టీ పిపిపి మరో అభ్యర్ధిని నామినేట్ చేసింది. మాజీ మంత్రి రాజా పర్వేజ్ అష్రఫ్ నూతన ప్రధాని కావడానికి రంగం సిద్ధమైంది. అంతకుముందు ఆరోగ్య మంత్రిగా వున్నపుడు అక్రమంగా మందుల దిగుమతులకు అనుమతి ఇచ్చారనే అంశంపై షాహబుద్దీన్‌ను అరెస్టు చేశారు. మంగళ వారం గిలానీ పదవి...
|
|
|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,050 కోట్ల డాలర్ల విలువ చేసే జౌళి ఎగుమతులు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 3,800 కోట్ల డాలర్ల విలువ చేసే జౌళి ఎగుమతులు చేయాలని ఈ మధ్య కాలంలో టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే దీన్ని తాజాగా సవరించి 2012-13లో 4,050 కోట్ల డాలర్ల ఎగుమతులకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. విదేశీ వాణిజ్య విధానంలో ఎగుమతిదార్లుకు అనేక ప్రొత్సాహకాలు ఇ...
|
|