|
నితిన్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'కొరియర్ బోయ్ కళ్యాణ్' చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గౌతమ్ వాసుదేవ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్స్ బేనర్‌పై తెరకెక్కుతోంది. ప్రభుదేవా వద్ద అసోసియేట్‌గా పనిచేసిన ప్రేమ్‌సాయి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో 'కొరియర్ బోరు కళ్యాణ్'గా, తమిళ్‌లో 'తమిళ సెల్వనుం తనియార అంజలుం' పేరుతో ఈ చిత్రం రూపొందబోతోంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్...
|
|
|
* రామానాయుడు ఫిలింస్కూల్ నెలకొల్పిన 2008 నుంచి మంచి ఆదరణ పొందుతుందని డి.సురేష్‌బాబు తెలియజేశారు. 2011నుంచి జవహర్‌లాల్ నెహ్రూ ఆర్టిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీతో ఎం.ఎఫ్. టెక్నికల్ కోర్సును టివి, ఫిలిం డైరెక్షన్, స్క్రీన్‌ప్లేలో ఆరంభించామని, ఈ ఏడాది బ్యాచిలర్ డిగ్రీ డిప్లొమా కోర్సును ప్రారంబిస్తున్నామని ఆయన చెప్పారు. మరిన్ని వివరాలకు 'రామానాయుడు ఫిలింస్కూల్.నెట్'ద్వారా సంప్రదించ...
|
|
|
ఆకాష్ టైటిల్ పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ రాజేష్'. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సోని చరిష్టా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆకాష్ వైవిధ్యమైన ఏడు పాత్రలు పోషించటం విశేషం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రహమత్ ప్రొడక్షన్స్ పతాకంపై యువ నిర్మాత ఖాదర్‌వల్లి నిర్మిస్తున్నారు....
|
|
|
సీమశాస్త్రి, సీమటపాకాయ్ చిత్రాలు రూపొందించిన నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అల్లరి నరేష్ మరో చిత్రాన్ని చేయబోతున్నాడు. అమ్మిరాజు కానుమిల్లి సిరి పతాకంపై నిర్మించబోతున్నారు. అక్టోబర్‌లో విజయదశమి నాడు షూటింగ్‌ను మొదలుపెట్టి డిసెంబర్‌నాటికి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్ గత చిత్రాల్లో కృష్ణ సినిమాలోని పాటలను రీమిక్స్ చేసినట్లే ఈ చిత్రంలోనూ చేయనున్నారు. పూర్తి వినోదంతోపాటు యాక్షన్...
|
|
|
శ్రీ,రేష్మ నూతన జంటతో మారుతీ దర్శకత్వంలో శ్రీనివాస్ నిర్మించిన 'ఈరోజుల్లో' చిత్రం నేటితో వందరోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారంనాడు సంస్థ కార్యాలయంలో కేక్‌ను కట్‌చేశారు. జులైమొదటివారంలో వందరోజుల వేడుకను జరపనున్నట్లు నిర్మాత తెలియజేశారు. కొత్తచిత్రమైనా ప్రేక్షకులు మంచిచిత్రాలని ఆదరిస్తారనేందుకు ఈరోజుల్లో ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు....
|
|
|
స్పైడర్ మాన్ సినిమాల పరంపరలో నాలుగవదిగా వచ్చిన 'ద అమేజింగ్ స్పైడర్‌మాన్' శుక్రవారం నాడు మన దేశంలో విడుదల అయింది. ప్రపంచమంతటా జూలై మూడున విడుదల కానున్న ఈ 3డి చిత్రం ఏకబిగిన రెండుగంటల 16 నిమిషాల పాటు మరోలోకంలోకి తీసుకు వెళుతుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ భారీ తెరపై ప్రేక్షకులను మరింతగా అలరిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. స్పైడర్ మాన్ పేరుతో గతంలో వచ్చిన చిత్రాల్లో హీరోగాటోబె మగ్వైర్ హీరోగా...
|
|
|
జయలక్ష్మి ఫిలింస్ పతాకంపై ఎల్‌ఎన్‌ఏలూరి సుబ్బారావు, కళ్యాణ్‌రాజ్ కరుటూరి కలిసి నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమతో నీ రవి'. రామ్స్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. నిర్మాతల్లో ఒకరైన సుబ్బారావు మాట్లాడుతూ..'అభినవ్, ధన్‌రాజ్, చంటి శ్రీరామచంద్ర, జెమినీరాగవ, అభి,వసంత్‌పై సన్నివేశాలను చిత్రించాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు చిత్రిస్తున్నారు. వచ్చేనెలలో రెండవ షెడ్యూల్...
|
|
|
* బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో రూపొందే 'ఆదిత్య 999' చిత్రానికి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆగస్టులో షూటింగ్ ప్రారంభిస్తారు. కాగా, ఇందులో కథానాయికగా త్యాస్సీ దాదాపు ఎంపికైనట్టు తెలుస్తోంది.న తారకరత్న హీరోగా రూపొందుతున్న 'మైక్ టెస్టింగ్ 143' సినిమాలో ఓ ఫన్నీ సన్నివేశంలో 'గబ్బర్‌సింగ్' హిట్ నెంబర్ 'కెవ్వు కేక' వస్తుందట. ఈపాటకు అర్చన డ్యాన్స్ చేస్తుందని...
|
|
|
సివిరెడ్డి గులాబి క్రియేషన్స్ పతాకంపై నారా రోహిత్, నిత్యమీనన్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం 'ఒక్కడినే'. శ్రీనివాస్‌రాగ దర్శకుడు. క్లైమాక్స్ మినహా చిత్ర టాకీ భాగం పూర్తయింది. చిత్రం గురించి నిర్మాత చెబుతూ.. 'పతాక సన్నివేశాన్ని ఫిలింసిటీలో చిత్రిస్తున్నాం. ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. జులై 3 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. దీంతో మూడు పాటలు మినహా చిత్రం పూర్తవుతుంది.మూడు పాటలన్ని ఇక్కడే చిత్రించ...
|
|
|
అబ్రహాం లింకన్ జీవితగాథతో చిత్రం రాబోతుంది. నిరుపేద కుటుంబంలో జన్మించిన అబ్రహాం లింకన్ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే చదువుకుని అత్యున్నత స్థానమైన అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాడు. అనంతరకాలంలో అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అబ్రహాం లింకన్ హయాంలోనే బీజాలు పడ్డాయి. అమెరికాకు 16వ అధ్యక్షుడిగా అబ్రహాం లింకన్ ఎన్నికయ్యేనాటికి అమెరికా అత్యంత సంక్షోభ పరిస్థితుల్లో.. అంతర్యుద్ధంతో...
|
|
|
తెలుగు తెరని నవ్వుల ప్రవాహంతో ముంచెత్తిన రాజేంద్రప్రసాద్, ఇటీవల పరిణితి గల పాత్రల్లో నటిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన 'ఓనమాలు' చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో స్కూలు హెడ్ మాస్టర్‌గా రాజేంద్రప్రసాద్, అతని భార్యగా కల్యాణి నటించారు. క్రాంతిమాధవ్ దర్శకనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఇప్పటికే అచ్చమైన తెలుగు కథగా పరిశ్రమ పెద్దల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో...
|
|