| ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో విజయా బ్యాంకు రూ.123.37 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ2లో రూ.203.53 కోట్ల లాభాలను నమోదు చేసుకుంది. దీంతో పోల్చితే గత క్యూ2 లాభాల్లో 39.3 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గత క్యూ2లో బ్యాంకు మొత్తం ఆదాయం 9.6 శాతం పెరిగి రూ.2,301.72 కోట్లకు చేరుకుంది. అంతక్రితం క్యూ2లో ఇది రూ.2,098.33 కోట్లుగా నమోదయ్యింది.... |