హిమ్ సంస్థ పేరుతో మండలంలో పేద మహిళల నుంచి మతం ముసుగులో సుమారు రూ.1.50కోట్ల వరకు వసూలు చేసి, మోసాలకు పాల్పడ్డారని సిపిఎం డివిజన్ కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు సుమారు 250 మంది బాధిత మహిళలతో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయం వద్ద సభలో ఆయన మాట్లాడుతూ మండలంలోని నిరుపేద మహిళలు, దళితులు, గిరిజనులు, ఇతర సామాజిక తరగతులకు...
|
పెంపుపై నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి గంగరాపు సింహాచలం మాట్లాడుతూ డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం లీటరుకు రూ.5పెంచడం దారుణమన్నారు. ఒక్కో కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలెండర్లు వినియోగం మించరాదని, అదనంగా అడిగితే రూ.750కి కొనుగోలు చేసుకోవాలని షరతులు పెట్టడం గ్యాసు వినియోగదారులకు గుదిబండగా మా...
|
చేపడుతున్న ఉపాధి హామీ పనులకు సంబంధించిన వేతనాలు చెల్లింపుల్లో చోటు చేసుకున్న అవకతవకలపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగరాపు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో చేపట్టిన పనుల్లో లక్షలాది రూపాయలు అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్థారిస్తున్నప్పటికీ పని చేసిన కూలీలకు వేతనాలు చెల్లింపులో జాప్యం వహిస్తున్నారని,...
|
కమ్యూనిస్టు వీరుడు, క్యూబా విప్లవం విజయవంతం కావడంలో కీలక భూమిక పోషించిన చే గువేరా వర్థంతి సందర్భంగా పాలకొండకు చెందిన యువ చిత్రకారుడు గంగరాపు హరీష్ మట్టితో 'చే' చిత్రం వేసి తన ప్రతిభను చాటాడు. ఈ చిత్రాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ఆదివారం ఆవిష్కరించారు. యువతకు చేగువేరా ఆదర్శమని ఈ సందర్భంగా ఎంవిఎస్ శర్మ అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చౌదరి తేజేశ్వరరావు, సిఐటియు నాయకులు విజికె...
|
బకాయిలున్న ఉపాధి బిల్లులు తక్షణమే చెల్లించాలని మండలంలోని గిరిజన వేతనదారులు సోమవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బైఠాయించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా నేటికీ వేతనాలు చెల్లించకపోవడం శోఛనీయమని, వేతనదారులకు 15రోజుల్లో బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఏడు నెలలు కావస్తున్నా ఇంకా చెల్లించకపోవడం...
|
పాలకొండ రూరల్: శాంతియుతంగా సమ్మె చేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులను ఆదివారం అరెస్టులు చేయడం అన్యాయమని సిపిఎం డివిజన్ కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు. స్థానిక విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ పోలీసుల అండదండలతో పారిశుధ్య కార్మికులను అరెస్టు చేశారని విమర్శించారు. సమ్మెలో ఉన్న కార్మిక సమస్యలు పట్టించుకోకుండా బయటి నుంచి వచ్చిన కార్మికులతో పనులు చేయించడం అన్యాయం చేయడమేనన్నారు. అరెస్టులు చేసినంత...
|
సబ్‌ప్లాన్ సక్రమంగా అమలు చేయకుండా దళిత, గిరిజనుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని సిపిఎం పాలకొండ డివిజన్ కార్యదర్శి గంగరాపు సింహాచలం అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 55వ వర్థంతి సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్ ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక ప్రధాన రహదారిలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివా...
|
పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి గంగరాపు సింహాచలం డిమాండ్ చేశారు. పట్టణంలోని బుట్టుమఠం ప్రాంతంలో సిపిఎం పట్టణ మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సిపిఎం నిరంతరం పేద, మధ్య తరగతి సమస్యలపై పోరాటం సాగిస్తుందన్నారు. మిగిలిన పార్టీలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వస్తాయని, సిపిఎం మాత్రమే నిరంతరం ప్రజా సమస్యలపై పని చేస్తుందని...
|
ఎగనామం పెడుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. 2010-2011 సంవత్సరానికి సంబంధించి సుమారు ఐదు లక్షల రూపాయలు వసూళ్లు కాకపోగా 2011-2012 సంవత్సరానికి 11లక్షల 83 వేల 332 రూపాయలు వసూళ్లు నిలిచిపోయాయి. కురవిలోని రెండు సంతల ద్వారా కురవి గ్రామపంచాయతీకి సుమారు రూ.73లక్షల 66 వేల 665 రూపాయల ఆదాయం సమకూరుతుంది. గతేడాది మార్చిలో నిర్వహించిన టెండర్‌లో కాంట్రాక్టర్లు పశువుల సంతకు 66లక్షల 99వేల 999 రూపాయలు, మేకలు,...
|
ప్రజలు కొంత మంది తమ ఆర్థిక అవసరాల కోసం సూక్ష్మ రుణ సంస్థల ద్వారా రుణాలను తీసుకున్నారు. సూక్ష్మరుణ సంస్థలైన ఎల్ అండ్ టి ద్వారా ప్రజలు తమ అవసరాల కోసం రుణాలను పొందారు. అయితే వడ్డీతో సహ కలిపి అసలు మొత్తం వాయిదాల రూపంలో నెల నెలా చెల్లించాలని సంస్థ వారు చెప్పారు. సూక్ష్మరుణ సంస్థలు వద్ద ఒక్క లబ్ధిదారుడు రూ.20వేలు అప్పుగా తీసుకున్నట్లయితే సంస్థ ఆదేశానుసారం 24శాతం వడ్డీతో కలపి ప్రతి నెలా 2వేల చొప్పున 12...
|